ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది;

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం జరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ బ్లాక్ లో ఉఫ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉండటంతో ప్రమాదంపై గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
హోంమంత్రి ఆరా...
ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది అధికారులు గుర్తించారు. ప్రమాదమా? లేక ఎవరైనా కావాలని ఈ పనిచేశారా? అన్న దానిపై లోతైన దర్యాప్తు చేయాలని, ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.