పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురు

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-12-24 07:04 GMT

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పేర్ని నాని తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. పేర్నినానిని రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని ఆయన తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అయితే ప్రభుత్వ న్యాయవాది మాత్రం పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని చెప్పారు.

నోటీసులు ఇచ్చినా...
ఈ నెల 22వ తేదీన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదన్నారు. దీంతో విచారణకు సహకరించాలని పేర్ని నానికి న్యాయస్థానం తెలిపింది. మళ్లీ నోటీసులు ఇస్తే విచారణకు వెళ్లాలని కోరింది. అలాగే హైకోర్టులో వేసిన పిటీషన ను వెనక్కు తీసుకోవాలని కూడా పేర్నినానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.


Tags:    

Similar News