వంశీకి అస్వస్థత... ఆసుపత్రిలో చికిత్స
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన పంజాబ్ లోని మొహాలీలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన పంజాబ్ లోని మొహాలీలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వల్లభనేని వంశీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చేస్తున్నారు. ఈ కోర్సులో తరగతులకు ఆయన పంజాబ్ లోని మొహాలీకి వెళ్లారు. మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతుండటంతో ఆయన అక్కడే ఉన్నారు.
రెండు రోజుల పాటు....
కానీ అక్కడ ఆయనకు ఎడమ చేయి తీవ్రంగా లాగడంతో ఇబ్బంది పడ్డారు. గుండెసంబంధిత వ్యాధి అని అనుమానించి వెంటనే ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యలు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు. గన్నవరంలో ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంశీ వద్ద ఉన్న ఆయన సన్నిహితులు చెప్పారు.