వచ్చే నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు...?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఫిబ్రవరి చివరి మాసంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇరవై నుంచి ఇరవై అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాధమికంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
రెండు అంతర్జాతీయ సదస్సులు....
అయితే మార్చి నెలలో రెండు అంతర్జాతీయ సదస్సులు ఏపీలో జరుగుతున్నాయి. ఆ తేదీలలో బడ్జెట్ సమావేశాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. మార్చి, 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలతో పాటు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. అలాగే మార్చి 28, 29 తేదీల్లో జీ 20 నన్నాహక సమాశాలు ఏపీలో జరగనున్నాయి. ఈ రెండు సదస్సుల తేదీల్లో బడ్జెట్ సమావేశాలు జరగకుండా తగిన తేదీలను సూచించాలని అధికారులకు ప్రభుత్వం తెలియజెప్పినట్లు సమాచారం.