గుడ్ న్యూస్.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి అమలు
నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‍లైన్ స్లాట్ బుకింగ్ ను ప్రభుత్వం కల్పిస్తుంది.;

నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‍లైన్ స్లాట్ బుకింగ్ ను ప్రభుత్వం కల్పిస్తుంది. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉండనుంది. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
దశల వారీగా...
మొత్తం ఆంధ్ర్రప్రదేశ్ లోని 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దశలవారీగా స్లాట్ బుకింగ్ విస్తరణ చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ వెబ్‍సైట్‍లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సదుపాయం కల్పించింది. స్లాట్ బుకింగ్స్ మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.