బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం
బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.
బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు రోజుల పనిదినాలు అసెంబ్లీ జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. తమపై సస్పెన్షన్ వేటు వేసి బీఏసీకి రమ్మనడం ఏంటని వారు స్పీకర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఐదు రోజులు...
చంద్రబాబు అరెస్ట్ అంశం శాసనసభ, శాసనమండలి లను కుదిపేశాయి. టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటుండటంతో పదిహేను మందిని ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ముగ్గురిని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అయితే తమ సస్పెన్షన్ ను సాకుగా చూపి టీడీపీ బీఏసీ సమావేశానికి గైర్హాజరయింది.