Chandrababu : రాత్రికి రాత్రి సాధ్యం కాదు.. హామీలన్నీ అమలుచేస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాత్రికి రాత్రి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాత్రికి రాత్రి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిందని, ఖజానా ఖాళీ చేసిందని ఆయన అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఐదు నెలల్లో అనేక అడుగులు వేశామని చంద్రబాబుచెప్పారు. ప్రజల్లో సంతృప్తి నెలకొల్పేలా పాలనను చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తుందని ఆయన తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని క్రమంగా గాడిన పడేస్తున్నామని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలతో..
సూపర్ సిక్స్ హామీలతో పాటు, ఎన్నికల మ్యానిఫేస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. తెలుగుదేశంపార్టీ తోనే సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభమయిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామని, రైతులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని చంద్రబాబు చెప్పారు. 120 సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారంచుట్టిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అనేక పథకాలను అందించి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి గా పనిచేశానని ఆయన చెప్పారు.