రైతులకు గుడ్ న్యూస్ ... నేడు వారి ఖాతాల్లో
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేడు జగర్ నష్టపరిహారం అంద చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నేడు ఇన్ పుట్ సబ్సిడీ జమ చేయనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేడు జగర్ నష్టపరిహారం అంద చేయనున్నారు. గత ఏడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకునేందుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇన్ పుట్ సబ్సిడీని.....
ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఇన్ పుట్ సబ్సిడీని రాష్ట్రంలోని 5,71,478 మంది రైతులు పొందనున్నారు. ప్రభుత్వం మొత్తం 534,77 కోట్లు జగన్ నేడు జమ చేయనున్నారు. దీంతో పాటు 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద 29.51 కోట్ల లబ్డి చేకూర్చనున్నారు.