బడ్జెట్ లో పోలవరం ప్రస్తావన ఏదీ?
కేంద్ర బడ్జెట్ పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ పెదవి విరిచారు
కేంద్ర బడ్జెట్ పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ వల్ల ఏపీకి ఉపయోగం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. విభజనతో అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగలేదని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీకి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగపడే ఒక్క అంశమూ లేదనన ఆయన పోలవరం ప్రాజెక్టు విషయాన్నే మరచిపోయారని అన్నారు.
తమ మ్యానిఫేస్టోలో...
అయితే తమ మ్యానిఫేస్టోలో పెట్టిన కొన్ని అంశాలను కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించడాన్ని జేడీ లక్ష్మీనారాయణ స్వాగతించారు. సోలార్ ఎనర్జీ, రూఫ్ టాప్ ప్లాన్ లో భాగంగా, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ వచ్చేందుకు , కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఇస్తామని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. . కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మ టూరిజం, కల్చర్ ఎకో, హెల్త్, మెడికల్, సినిమా, అడ్వెంచర్ స్పోర్ట్స్, కోస్టల్ టూరిజం అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు.