కొడాలి నానికి ఊరట.. కీలక పదవి అప్పగించనున్న ప్రభుత్వం

మంత్రి పదవి కోల్పోయిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. మంత్రి పదవి కోల్పోయినప్పటికీ.. కీలక పదవి వరించనుంది.;

Update: 2022-04-10 12:42 GMT
కొడాలి నానికి ఊరట.. కీలక పదవి అప్పగించనున్న ప్రభుత్వం
  • whatsapp icon

గుడివాడ : ఏపీలో నూతన మంత్రివర్గం ఖరారైంది. కొత్త మంత్రి వర్గం రేపు ఉదయం 11.31 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుంది. పాతమంత్రివర్గంలో పలువురు మంత్రులు పదవులను నిలుపుకోగా.. మరికొందరికి మాత్రం నిరాశ తప్పలేదు. మంత్రి పదవి కోల్పోయిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. మంత్రి పదవి కోల్పోయినప్పటికీ.. కీలక పదవి వరించనుంది. ఏపీ ప్రభుత్వం కొడాలి నానికి కీలక పదవి అప్పగించనుంది.

ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు డైరెక్టర్ గా.. కేబినెట్ హోదాలో కొడాలి నానిని నియమించనున్నారు. ఇప్పటివరకూ ఏపీలో స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు లేదు. త్వరలోనే బోర్డును ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ గా కొడాలి నానిని నియమించనుంది ప్రభుత్వం. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణుపేరు ఖరారైన విషయం తెలిసిందే.


Tags:    

Similar News