నేడు గుడివాడలో రైతుల మహా పాదయాత్ర
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 13వరోజుకు చేరుకుంది
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 13వరోజుకు చేరుకుంది. నేడు కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈరోజు ప్రారంభమయ్యే పాదయాత్ర గుడ్లవల్లేరు గ్రామంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలూరుకు చేరుకుంటుంది. అక్కడ రైతులు మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. అనంతరం సాయంత్రం బయలు దేరి వీఎన్ఆర్ కళాశాల వరకూ సాగుతుంది.
పోలీసుల భద్రత మధ్య....
వి కన్వెన్షన్ సెంటర్ లో రాత్రి బస ఉంటుంది. ఈరోజు మొత్తం పదిహేను కిలోమీటర్లు నడవాలని రైతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలో జరుగుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతులు కూడా సంయమనంతో వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.