మెగాస్టార్ చిరంజీవి ఫిదా.. పవన్ కల్యాణ్ స్పీచ్‌పై ఎమోషనల్...!
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్‌పై చిరంజీవి స్పందించారు. తమ్ముడి మాటలు తన హృదయాన్ని కదిలించాయని చెప్పారు.;

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన శక్తివంతమైన ప్రసంగంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమ్ముడు పవన్ ప్రసంగం చూసి ఫిదా అయ్యానని, సభలో పాల్గొన్న అపార జనసంద్రంలా తన మనసు కూడా ఉప్పొంగిపోయిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని, పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదించారు. జనసైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ ప్రసంగం హాట్ టాపిక్
గురువారం పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసైనికులు, పవన్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ ప్రసంగంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్ర గడ్డపై 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేయడం, తెలంగాణను 'కోటిరతనాల వీణ'గా కొనియాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన పునర్జన్మకు కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలు, అభిమానుల ప్రేమ కారణమని, జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ అని పవన్ గుర్తు చేశారు. గద్దర్ పట్ల తన అభిమానాన్ని, దారథి సాహిత్యం తనపై చూపిన ప్రభావాన్ని పవన్ వివరించారు. 'రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా' అనే మాటను నిజం చేశామని పవన్ అన్నారు.