వారం రోజుల్లోనే గుడ్ న్యూస్.. శుభం కార్డు పడినట్లే

సినీ ఇండ్రస్ట్రీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.

Update: 2022-02-10 08:14 GMT

సినీ ఇండ్రస్ట్రీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సానుకూలంగా స్పందించినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాలకు ఐదో షో వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అలాగే టిక్కెట్ల ధరలపై కూడా ఇటు ప్రజలకు, అటు ఇండ్రస్ట్రీకి నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని చెప్పారని అన్నారు. ఇండ్రస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు.

ఐదో షోకు అనుమతి....
చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో తరహాలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని జగన్ చెప్పారన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీలపై త్వరలో జీవో వస్తుందని చెప్పారు. ఇండ్రస్ట్రీ సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్నందుకు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం రోజుల్లో అందరం గుడ్ న్యూస్ వింటామన్నారు. పెద్ద, చిన్న సినిమా కష్టాల గురించి ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారని రాజమౌళి తెలిపారు. జగన్ కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు సంతృప్తికరంగా సాగాయి. చాలా సమయం ఇచ్చి చిత్ర పరిశ్రమ సమస్యలను విన్నందుకు ప్రభాస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆరేడు నెలల నుంచి చిరంజీవి ఇదే పనిమీద ఉన్నారన్నారు. సినీ పరిశ్రమ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లడంలో చిరంజీవి చూపిన చొరవ అభినందనీయమని మంత్రి పేర్ని నాని తెలిపారు.


Tags:    

Similar News