ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Update: 2021-12-10 02:11 GMT

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తాంధ్రలోనూ...
అల్పపీడన ద్రోణి కారణంగా ఉత్తరకోస్తాంధ్రలో సయితం తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో భారీగా దెబ్బతిన్నాయి. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News