Andhra Pradesh : మరో అల్పపీడనం.. కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మరో ముప్పు పొంచి ఉంది.బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని పేర్కొంది.
కోస్తాంధ్రకు ....
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోయాయి. వరదలు సంభవించాయి. మరోసారి భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఇప్పటికే తీవ్రంగా నష్టంపోయారు. ఇటు ప్రాణ, అటు ఆస్తి నష్టం కూడా సంభవించిన సంగతి తెలిసిందే.