నేడు జైపూర్ కు మంత్రి నారాయణ
నేడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జైపూర్ కు వెళ్లనున్నారు.;

నేడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జైపూర్ కు వెళ్లనున్నారు. జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ ఉన్నతస్థాయి ప్రాంతీయ 3R సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొనున్నారు. సదస్సుకు ఆసియా ,పసిఫిక్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు.
వివిధ అంశాలపై...
ప్రధానంగా సమీకృత వ్యర్దాల నిర్వహణ ,వాతావరణ సంస్కరణలు,సర్కులర్ ఆర్థిక వ్యవస్థ ను ప్రోత్సహించడం పై సదస్సులో చర్చ జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు ,స్వచ్చంద్ర కార్పొరేషన్ అధికారులు జైపూర్ చేరుకున్నారు. ఈ సదస్సులో ఏపీలో అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు మంత్రి నారాయణ.