Andhra Pradesh : నేడు ఏపీలో ఏన్డీఏ పక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మంగళగిరిలోని సి కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది. ఈ వందరోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు సంభవించిన విపత్తులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
ఎమ్మెల్యేల గ్రాఫ్ ను...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల గ్రాఫ్ ను కూడా సమావేశంలో వారి ముందు ఉంచుతారని తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరు వందరోజుల్లో ఎలా ఉందన్న దానిపై ఆయన నివేదికలు ఇవ్వనున్నారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా చంద్రబాబు స్పందించనున్నారు. ఈ సమావేశంలో కీలకంగా రానున్న కాలంలో అమలు చేయనున్న హామీల గురించి కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించనున్నారు.