Chandrababu : నేడు బర్డ్ ఫ్లూపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. వివిధ శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆరోగ్య శాఖపై సమీక్ష చేస్తారు. ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం అమలుపై చర్చించనున్నారు.
వివిధ శాఖల అధికారులతో...
అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు కార్మిక శాఖపై సమీక్ష చేయనున్నారు. తర్వాత సాయంత్రం 4.40 గంటలకు బర్డ్ ఫ్లూపై సమీక్ష చేస్తారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించేలా అధికారులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.