బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్.. ఆ మేటర్ లో ఇది రెండోసారి !

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ ఇచ్చిన

Update: 2021-12-27 08:38 GMT

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు బండ్ల గణేష్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ ఇచ్చిన రూ.1.25కోట్ల చెక్ బౌన్స్ అయింది. దాంతో అతను కోర్టును ఆశ్రయించగా.. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలిచ్చినా బండ్ల గణేష్ స్పందించలేదు. బండ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అతడిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచాలని పోలీసులకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

కడపలోనూ కేసు నమోదు
జడ్జి ఆదేశాలతో.. బండ్ల గణేష్ నేడు కోర్టుకు హాజరుకానున్నారు. కాగా.. గతంలోనూ బండ్ల గణేష్ పై ఏపీలో కేసు నమోదైంది. అదికూడా ఫైనాన్షియల్ విషయమే కావడం గమనార్హం. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్న బండ్ల గణేష్.. తిరిగి చెల్లించకపోవడంతో అతను కడపలో ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ఇలాగే కోర్టుకు హాజరు కాకపోవడంతో.. బండ్ల గణేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. ఆ తర్వాత పోలీసులు బండ్ల గణేష్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇలా ఎప్పటికప్పుడే ఫైనాన్షియల్ మేటర్స్ లో ఇరుక్కుంటూ.. వార్తల్లో నిలుస్తున్నారు బండ్ల. స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తే తప్ప కోర్టుకు హాజరు కావడం లేదు.



Tags:    

Similar News