వర్షాలే వర్షాలు.. వేటకు వెళ్లకండి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.;

Update: 2023-06-25 05:17 GMT
ap and telangana weather update

ap and telangana weather update

  • whatsapp icon

నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు సాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలుపడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం ఉధృతంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 69.8 మిల్ల్లీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.


Tags:    

Similar News