రాష్ట్రంలో రెండువేల నోట్లు ఏమయ్యాయి?
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరగుతుందన్నారు. వాటిని తమ పార్టీ ప్రజా పోరు సభల ద్వారా ఎండగట్టిందన్నారు. ప్రభుత్వం పై తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో రక్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని తాను కేంద్ర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్రంలో రెండు వేల నోట్లు ఎందుకు కన్పించకుండా పోయాయో విచారణ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరతామని జీవీఎల్ తెలిపారు.
రెండు పార్టీలు...
తెలుగుదేశం పార్టీకి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని అన్నారు. ఆ పార్టీ పూర్తి అభద్రతా భావంతో ఉందన్నారు. నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతుందన్నారు. నిరాశపరిచిన గతం టీడీపీది అయితే, భరించలేని ప్రస్తుతం వైసీపీది అని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీలది కుటుంబ పార్టీలేనని ఆయన ధ్వజమెత్తారు. రెండు పార్టీలతో రాష్ట్రంలో కాపులకు, బీసీలకు న్యాయం జరగలేదన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.