YSRCP : అదంతా ఒట్టి ప్రచారమే

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి శరత్‌చంద్రారెడ్డి పోటీ చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు;

Update: 2024-02-24 13:01 GMT
YSRCP : అదంతా ఒట్టి ప్రచారమే
  • whatsapp icon

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి శరత్‌చంద్రారెడ్డి పోటీ చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అది వాస్తవం కాదన్నారు. శరత్ చంద్రారెడ్డి నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

వచ్చే వారంలో...
వచ్చే వారంలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి కొత్త ఇన్‌ఛార్జిని నియమిస్తారని తెలిపారు. వైసీపీ విషయలో ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. త్వరలోనే జగన్ కొత్త ఇన్‌ఛార్జిని నియమిస్తారని చెప్పారు. రెండు రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని కూడా నియమిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.


Tags:    

Similar News