Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ అధికంగా ఉంది;

Update: 2025-04-02 04:06 GMT
rush, devotees, wednesday,  tirumala
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ అధికంగా ఉంది. విద్యార్థులకు పదో తరతగతి, ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పెద్దసంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. తిరుమలలో వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎంతలా అంటే ఎక్కడ చూసినా భక్తులు సందడినెలకొంది. లడ్డూ ప్రసాదాల కౌంటర్ దగ్గర నుంచి అన్నదానసత్రం వరకూభక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

6వ తేదీన శ్రీ రామనవమి...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రిల్ 6వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరగనుంది. ఏప్రిల్ 06న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. ఏప్రిల్ 06న శ్రీవారి ఆలయంలో రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత వేడుకగా శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. ఏప్రిల్ 07న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ శ్రీ రామ పట్టాభిషేకం జరుగుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలోని దాదాపు ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.ఉచిత దర్శనం క్యూ లైన్ లోకిఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలసమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగా సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,000 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ ఐదుకోట్ల రూాప రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News