Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది;

Update: 2025-04-04 03:32 GMT
darsan time today in tirumala,  rush, devotees, friday
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఉన్నాయి. పరీక్షలు ముగియడంతో ఎక్కువ మంది తిరుమల శ్రీనివాసుడికి మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు. తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కళకళలాడిపోతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.

దర్శనం త్వరగా పూర్తయ్యేలా...
వీలయినంత త్వరగా దర్శనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో మరింత రద్దీ పెరుగుతుంది. దీంతో ముందు నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి టోటోకెన్లు ఏరోజుకారోజు పొంది తిరుమలకు వచ్చేవారు, కాలినడకన వచ్చే భక్తులు, ఎన్ఆర్ఐ భక్తులు, వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతి ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,864 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,784 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News