రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ కన్నుమూత

ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం;

Update: 2025-04-07 07:33 GMT
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ కన్నుమూత
  • whatsapp icon

ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. సంబేప‌ల్లి మండ‌లం య‌ర్ర‌గుంట్ల వ‌ద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్‌-2 స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చ‌నిపోయిన స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రాయ‌చోటి క‌లెక్ట‌రేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

డిప్యూటీ కలెక్టర్ రమాదేవి పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో బాధితులను అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పరామర్శించారు. రమాదేవి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం.


Tags:    

Similar News