Tirumala : తిరుమలలో పెరిగిన రద్దీ.. ఆదివారం కొండకు భక్తుల తాకిడి
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమల కొండ మీద గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతుంది. ఇటీవల వరకూ స్వల్పంగానే ఉన్న రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భారీ వర్షాల ముప్పు తప్పడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు ఎంత మంది వచ్చినా వారికి సత్వరం దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు కూడా టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. ఆదివారం సహజంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. తిరుమల అన్నప్రసాదం సత్రం వద్ద, లడ్డూ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. దీంతో పాటు సర్వదర్శనానికి కూడా క్యూ లైన్ పెరిగింది. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అనేక మంది భక్తులు ఎటువంటి దర్శన టిక్కెట్లు లేకుండా వచ్చి ఉచిత దర్శన క్యూ లైన్ లోకి వస్తుండటం వల్లనే ఇంతటి రద్దీ ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు.