Ayodhya : నేడు కాకినాడ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రెయిన్

నేడు కాకినాడ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు బయలుదేరనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.;

Update: 2024-02-11 03:29 GMT
Ayodhya : నేడు కాకినాడ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రెయిన్
  • whatsapp icon

అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహం ప్రతిష్ట తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఎక్కువ మంది భక్తులు అయోధ్య చేరుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వెళుతున్నారు. అయోధ్యకు రోజుకు లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారు. నేడు కాకినాడ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు బయలుదేరనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం...
ఈ ప్రత్యేక రైలు కాకినాడ నుంచి ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు అయోధ్యకు ఈ రైలు చేరుకుంటుంది. మొత్తం 1,852 కిలోమీటర్ల మేర ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరిగి ఈ నెల 14వ తేదీన అయోధ్య నుంచి రైలు బయలుదేరి కాకినాడకు రానుంది.


Tags:    

Similar News