ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే?
ఆంధప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.
జూన్ 12న తిరిగి...
తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయని తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా వేసవి సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు నలభై రోజుల పాటు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.