Tirumala : గురువారం కూడా తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు కూడా రద్దీ లేదు. గురువారం భక్తుల రద్దీ అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు;

Update: 2024-05-09 03:15 GMT
specaial darshan tickets, november month quota, Tirumala Tirupathi
  • whatsapp icon

తిరుమలలో నేడు కూడా రద్దీ పెద్దగా లేదు. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. వారం అనేది లేకుండా ప్రతి రోజూ తిరుమలకు భక్తులకు క్యూ కడుతుంటారు. కానీ ఎండల వేడిమికి ఈసారి రద్దీ అంతగా లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

ఆదాయం మాత్రం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,766 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,158 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.09 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News