శ్రీవారికి ఓ కుటుంబం కోటి విరాళం

ఈరోజు ఒక భక్తుడు కోటి రూపాయల విరాళాన్ని తిరుమల స్వామి వారికి ప్రకటించారు

Update: 2022-09-20 13:07 GMT

తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు ప్రకటిస్తుంటారు. తాము అనుకున్నవి జరిగితే ఏడుకొండల వాడికి కానుకలు సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. అలాగే ఇక నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎంతో కొంత హుండీలో డబ్బులు, బంగారాన్ని వేస్తుంటారు. అందుకే రోజుకు కోట్ల రూపాయల ఆదాయం హుండీ ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి వస్తుంటుంది. ఆపద మొక్కుల వాడికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం సాధారణ విషయమే.

తమిళనాడుకు చెందిన...
ఇందులో ప్రాంతాలకు అతీతంగా భక్తులు స్వామి వారికి భక్తి ప్రపత్తులతో విరాళాన్ని అందజేస్తుంటారు. తాజాగా ఈరోజు ఒక భక్తుడు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడుకు చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు దేవ దేవుడికి 1.02 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇందులో అన్న ప్రసాదం ట్రస్టుకు 15 లక్షలు, పద్మావతి విశ్రాంతి భవనంలో కొత్త ఫర్నిచర్, వంటశాల కోసం 87 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఆలయ ఈవో ధర్మారెడ్డికి చెక్కును ఈ దంపతులు అందచేశారు.


Tags:    

Similar News