నేడు రథసప్తమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు రథసప్తమి వేడుకలు కావడంతో భక్తులు ఆలయాల్లో బారులు తీరారు;

నేడు రథసప్తమి వేడుకలు కావడంతో భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. తిరుమల, అరసవల్లి దేవస్థానాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. సూర్యప్రభ వాహనంపై స్వామి వారు సూర్య కిరణాలు తాకిన వెంటనే ప్రారంభమయ్యాయి. మలయప్పస్వామిని మాడవీధుల్లో తిలకించేందుకు తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అరసవల్లి దేవస్థానంలో...
ఇక శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో స్వామి వారిని ఉదయాన్నే దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అరసవల్లి దేవస్థానంలో స్వామి నిజరూప దర్శనం లభిస్తుందని తెలియడంతో భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది తరలి రావడంతో ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. భక్తులు ఇబ్బంది పడకుండా మజ్జిగ, అన్న ప్రసాదాలను క్యూ లైన్లలో పంచుతుంది.