నేడు విశాఖలో జైల్ భరో

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆందోళనకు దిగనుంది.;

Update: 2022-02-13 02:04 GMT
visakhapatnam steel plant., jail bharo, tdp, janasena, yssrcp
  • whatsapp icon

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆందోళనకు దిగనుంది. జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించ వద్దంటూ కార్మికులు చేస్తున్న ఆందోళన నిన్నటికి ఏడాది అయింది. దీంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి జైల్ భరో కార్యక్రమం చేపట్టింది.

స్టీల్ ప్లాంట్ నుంచి...
గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టాలని పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున కార్మికులు తరలి వస్తారని చెబుతుంది. జైల్ భరో కు మద్దతుగా అన్ని పార్టీలు నిలవడంతో పెద్దయెత్తున ప్రజలు తరలివచ్చే అవకాశముంది. స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులు ర్యాలీగా వచ్చి గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద జైల్ భరోను నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News