నేషనల్ హైవే పై రాకపోకలు బంద్.. నిలిచిన వాహనాలు

భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లో రాకపోకలు కూడా అనేక ప్రాంతాలకు నిలిచిపోయాయి

Update: 2021-11-21 04:47 GMT

భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లో రాకపోకలు కూడా అనేక ప్రాంతాలకు నిలిచిపోయాయి. ఏపీలోని పలు జిల్లాలకు మధ్య ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధించింది. పాపాఘ్ని వంతెన కూలిపోవడంతో అనంతపురం - కడప జిల్లాల మధ్య ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇక నెల్లూరు - చెన్నై జాతీయ రహదారి కూడా భారీ వర్షాలకు దెబ్బతినింది.

ఇటు వైపు రావద్దు....
ఆరు లేన్ల జాతీయ రహదారి ఒకవైపు భారీ వర్షాలకు దెబ్బతినింది. రోడ్డు మధ్యలో గుంత ఏర్పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చెన్నై - నెల్లూరుల మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. హైవే వరద దెబ్బకు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఇటువైపు రాకుండా అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. చెన్నై వైపు వాహనాలు, నెల్లూరు వైపు వచ్చే వాహనాలను దాదాపు ముప్పయి కిలోమీటర్ల ముందే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వాహనాలను మళ్లించే అవకాశం కూడా లేదు. పెన్నా నది ఉధృతి కారణంగా పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.


Tags:    

Similar News