బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు బీపీ డౌన్.. పట్టుకోల్పోవడంతో

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ కు బీపీ డౌన్ కావడంతో అదుపు తప్పి రోడ్డుపక్కన పడిపోయింది

Update: 2024-02-19 12:09 GMT

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ కు బీపీ డౌన్ కావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఆనుకుని ఒరిగిపోయింది. కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న టీఎస్‌ఆర్టీసీ బస్సు భద్రాచలం వెళుతుండగా కత్తిపూడి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో...
డ్రైవర్ భాస్కర్‌రావు బస్సు నడుపుతుండగా ఒక్కసారి బీపీ డౌన్ కావడంతో బస్సు అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 21 మంది  ప్రయాణికులున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాలను నిర్వహించారు. బస్సు డ్రైవర్ తో పాటు గాయాలపాలయిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.


Tags:    

Similar News