సస్పెన్షన్ పై మేకపాటి రెస్పాన్స్ ఏంటంటే?

సస్పెన్షన్ వల్ల తాను రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నానని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు;

Update: 2023-03-24 13:05 GMT
సస్పెన్షన్ పై మేకపాటి రెస్పాన్స్ ఏంటంటే?
  • whatsapp icon

స్పెన్షన్ వల్ల తాను రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నానని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు. మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారని ఆయన ఆవేదన చెందారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్‌కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారని ఆయన బాధపడ్డారు.

రాజీనామా చేస్తా....
తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరమని, వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిలో గుసగుసలు మొదలయ్యాయని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాను మూడున్నరేళ్లు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవి ఉన్నా జగన్ కోసం రాజీనామా చేసి వచ్చానన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


Tags:    

Similar News