విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ : మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు.;

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను కాపాడతామనే నమ్మకాన్ని నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజీ కేటాయించిన మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముడిసరుకు, బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేషన్ కోసం ఈ నిధులను కేటాయిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
11,447 కోట్ల ప్యాకేజీని...
స్టీల్ ప్లాంట్ కు 11,447 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మికులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, విశాఖస్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని ఆయన తెలిపారు.