Ys Jagan : వైఎస్ జగన్ నేడు నేతలతో సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు.;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారందరికీ ఆహ్వానం పంపారు. అధికార పార్టీ బెదిరింపులకు, ప్రలోభాలకు తలవొంచకుండా పార్టీ కోసం నిలబడినుందుకు వారికి ధన్యావాదాలు తెలపనున్నారు.
ద్వితీయ శ్రేణి నేతలతో...
ద్వితీయ శ్రేణి నేతలు చూపించిన తెగువ, ధైర్యసాహసాలను కొనియాడనున్నారు. ఈరోజు బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఎన్టీఆర్, బాట్ల జిల్లాలోని వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు కో ఆప్షన్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. స్వయంగా వారిని కలసి అభినందనలు తెలపడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయన్న భరోసా ఇవ్వనున్నారు.