Andhra Pradesh : పీఏసీ ఎన్నికలు.. కాసేపట్లో.. వైసీపీ సంచలన నిర్ణయం
ప్రజా పద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.
ప్రజా పద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గతంలో ఉన్న సంప్రదాయాలకు విరుద్థంగా ప్రతిపక్షానికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా మిత్ర పక్షానికే కూటమి ప్రభుత్వం కేటాయించడాన్నినిరసిస్తూ ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
బహిష్కరించాలని...
పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నుంచి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే అదే సమయంలో జనసేన నుంచి పులవర్తి ఆంజనేయులు కూడా నామినేషన్ వేశారు. మరికాసేపట్లో బ్యాలట్ పద్ధతిలో ఎన్నిక జరగాల్సి ఉండగా వైసీపీ ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చారంటూ పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.