Gold Rates : ఊరట అని అనుకోవాలా? పెరగలేదని సంబరపడాలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు తగ్గితేనే అది మనకు వార్త అవుతుంది. నిత్యం పెరగడమే తప్ప బంగారానికి తగ్గడం అంటూ తెలియదన్న సామెత కూడా వినపడుతూనే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎక్కువ సార్లు తగ్గుతుండటం కొంత కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమే. అయినా సరే సామాన్యులు ఎవరికీ పసిడి ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. కొనాలన్నా కష్టంగా మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
ధరలు పెరుగుతాయని...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి అంశాలు కూడా హెచ్చు తగ్గుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినా బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గడం లేదు. కొనుగోళ్లు ఆగడం లేదు. జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి. డిమాండ్ కు తగిన బంగారం లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయంటారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండో రోజు కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,690 రూపాయలుగా నమోదయి ఉంది. కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో 79,000 రూపాయలుగా కొనసాగుతుంది.