Gold Price Today : ఎంత చల్లటి కబురు.. పసిడి చేతికి అందుతుందిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది

Update: 2024-09-16 03:57 GMT

పసిడిని కొనుగోలు చేయడం నేటి రోజుల్లో ఆషామాషీ కాదు. బంగారం అనేది విలాసవంతమైన వస్తువుగా మారిపోయి చాలా రోజులవుతుంది. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే గోల్డ్ అందుబాటులో ఉండేలా ధరలు పైపైకి ఎగబాగుతూ పోతున్నాయి. ఎంతగా అంటే సామాన్యులు, మధ్యతరగతి జీవుడు కొనుగోలు చేయలేని విధంగా బంగారం ధరలు పెరిగిపోయాయి. దీంతో కొందరు గిల్ట్ నగలతో సరిపెట్టుకుంటూ ఆనంద పడుతుండగా, మరికొందరు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను కొనుగోలు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే మహిళలు.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని మగువలకు అత్యంత ఇష్టపడే వస్తువు ఏదైనా ఉంటుంది అంటే అది పుత్తడి మాత్రమే.

అన్ సీజన్ అయినా...
అయితే ఈ నెల అన్ సీజన్. పెళ్లిళ్లు లేవు. ముహూర్తాలు లేకపోవడంతో కొనుగోళ్లు కూడా పెద్దగా జరగడం లేదు. అయితే వచ్చే నెల నుంచి వరసగా పెళ్లిళ్లు, మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిగా చూసేవాళ్ల సంఖ్య మరింత పెరిగడంతో కొనుగోళ్లు అన్ సీజన్ లో కూడా జరుగుతున్నాయని జ్యుయలరీ వ్యాపారులు చెబుతున్నారు. వీరితో పాటు ముందుగా నిర్ణయించుకున్న పెళ్లిళ్ల ముహూర్తాల కోసం ఇప్పటి నుంచే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పెరుగుతాయన్న అభిప్రాయంతో ముందు జాగ్రత్త పడుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర 74,880 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర నేడు వంద రూపాయలు తగ్గి 96,900 రూపాయలుగా ఉంది. ఈ ధరలు మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.


Tags:    

Similar News