Aadhaar: సమయం లేదు మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే ఛాన్స్‌!

సాధారణంగా కొన్ని పనులు చేసుకోవాలంటే అందుకు గడువు ఉంటుంది. ఆ గడువు లోగా పనులు చేసుకోకుంటే సమయం

Update: 2024-09-13 15:50 GMT

Aadhaar

సాధారణంగా కొన్ని పనులు చేసుకోవాలంటే అందుకు గడువు ఉంటుంది. ఆ గడువు లోగా పనులు చేసుకోకుంటే సమయం వృధా కావడమే కాకుండా కొన్ని ఛార్జీలను కూడా భరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పనులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సమయంలోగా పనులు పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక అసలు మ్యాటర్‌లోకి వస్తే.. ఆధార్‌.. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్‌ లేనిది ఏ పనులు చేయడం సాధ్య కాదు. సిమ్‌ కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు ఆధార్‌ లేనిది పనులు జరగవు. అయితే మీరు ఆధార్‌ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయినట్లయితే ఈ వార్త మీ కోసమే.

పదేళ్లు దాటితే మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్‌డేట్‌ చేసుకునేందుకు ఎలాంటి రుసుము లేదు. ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు సెప్టెంబర్‌ 14వ తేదీ వరకు గడువు ఉంది. అంటే ఇంకా ఒక రోజు మాత్రమే సమయం. ఇక గడువు దాటిన తర్వాత ఆధార్‌ కార్డు పని చేయదా? అనే అనుమానం రావచ్చు. అలాంటి దేమి ఉండదు. కార్డు పని చేస్తుంది కాని గడువు తర్వాత అప్‌డేట్‌ చేసుకోవడం కూడా తప్పనిసరి. ఆ తర్వాత చేసుకుంటే అందుకు కొంత ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే కార్డులో చిరునామా, పేర్లు, ఇత వివరాలు మారవచ్చు. అందుకే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా మీ ఆధార్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోవడం ముఖ్యం. గడువు దాటిన తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ఆధార్‌ను అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?

ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ని సందర్శించండి.

- ఆ తర్వాత మై ఆధార్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

- అప్‌డేట్ ఆధార్ వివరాలు పేజీకి వెళ్లి, డాక్యుమెంట్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.

- మీ యూఐడీ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేసి Send OTPపై క్లిక్ చేయండి.

- మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి (మీ ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింకు చేసి ఉండటం తప్పనిసరి)

- ఇక అప్‌డేట్ చేయాల్సిన సమాచారాన్ని ఎంచుకుని, వివరాలను నమోదు చేయాలి.

- అవసరమైన పత్రాలను ముందుగానే స్కామ్‌ చేసుకోవడం లేదా మొబైల్‌ ద్వారా ఫోటో తీసుకుని అప్‌లోడ్‌ చేయాలి. (పత్రాలు అక్కడ చూపించే సైజులు సెట్‌ చేసుకోవాలి.)

- మీరు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ని పొందుతారు. దాని నుండి మీరు అప్‌డేట్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.

- ఆన్‌లైన్ ప్రాసెస్‌కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరరం లేదు. 


Tags:    

Similar News