పాల ట్యాంకర్ ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మిల్క్ ట్యాంకర్‌ను
బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మిల్క్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొనడంతో కనీసం 18 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గార్హా గ్రామ సమీపంలో పాల ట్యాంకర్‌ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి బంగార్మావుకు తరలించారు. ఉన్నావ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.