ACB : వామ్మో ఇంత బంగారమా? ఇన్ని కరెన్సీ కట్టలా...? ఏం మాయ చేశావమ్మా?
గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి జగజ్యోతి అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది.
గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో జగజ్యోతి ఈఈగా పనిచేస్తున్నారు. ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 3.64 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు జగజ్యోతి ఇంట్లో 65.50 లక్షల నగదు కూడా లభ్యమయింది.
పదుల ఎకరాల భూములు...
దీంతో పాటు అనేక ఎకరాలకు సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద స్థాయిలో బంగారం, నగదు పట్టుబడటంతో జగజ్యోతి ఎంత అవినీతికి పాల్పడ్డారన్నది చెప్పకనే తెలుస్తుందని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ప్రకటించిది.