తునీషాకు బ్రేకప్ చెప్పడానికి కారణం.. శ్రద్ధావాకర్ హత్య : ప్రియుడు షీజాన్

బలవంతంగా ఆమె నుండి విడిపోయేందుకు ప్రయత్నించినట్లు షీజాన్ అంగీకరించాడు. అతడు బ్రేకప్ చెప్పడానికి గల కారణాలు..

Update: 2022-12-27 05:18 GMT

tunisha sharma

బాలీవుడ్ సినిమా అండ్ సీరియల్ యాక్టర్ తునీషా శర్మ బలవన్మరణానికి పాల్పడటం.. బీ టౌన్ లో కలకలం రేపింది. డిసెంబర్ 24న ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునిషా.. అక్కడి మేకప్ రూమ్ లోనే ఉరివేసుకోవడం అందరినీ షాకయ్యేలా చేసింది. అప్పటి వరకూ సెట్ లో ఎంతో చలాకీగా.. సందడి సందడిగా తిరిగిన తునీషాను విగతజీవిగా చూసి.. తోటి నటీనటులతో సహా సెట్ లో వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తునీషా మరణానికి కారణం.. లవ్ ఫెయిల్యూరేనని తేల్చిన పోలీసులు.. సహ నటుడు, ప్రియుడైన షీజాన్ మహమ్మద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా.. షీజాన్ పోలీసుల విచారణలో తునీషా ఆత్మహత్యకు గల కారణం చెప్పినట్లు తెలుస్తోంది. తునీషాకి ఇష్టం లేకుండా బ్రేకప్ చెప్పి.. బలవంతంగా ఆమె నుండి విడిపోయేందుకు ప్రయత్నించినట్లు షీజాన్ అంగీకరించాడు. అతడు బ్రేకప్ చెప్పడానికి గల కారణాలు కూడా పోలీసులకు వెల్లడించాడు. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన శ్రద్ధావాకర్ హత్య.. తనను ఈ బ్రేకప్ నిర్ణయం తీసుకునేలా చేసిందని పేర్కొన్నాడు షీజాన్. తునీషా వయసు 20 ఏళ్లు కాగా.. షీజాన్ వయసు 28. ఇద్దరి మధ్య 8 ఏళ్లు వయసు తేడా, పైగా కులాలు కూడా వేరు అవ్వడంతో.. భవిష్యత్తులో సమస్యలు తప్పవు అనే ఉద్దేశ్యంతోనే బ్రేకప్ చెప్పినట్లు వివరించాడు.
కాగా.. 13 ఏళ్లకే తునీషా నటిగా కెరీర్ ను ఆరంభించింది. 'భారత్ కా వీర్ పుత్ర' సీరియల్తో నటిగా మారిన తునీషా.. ఆ తర్వాత 'చక్రవర్తి అశోక సామ్రాట్', 'గబ్బర్ పూన్చావాలా', 'ఇంటర్నెట్ వాలా లవ్', 'హీరో: గాయబ్ మోడ్ ఆన్' వంటి సీరియళ్లలో నటించారు. ఆ తర్వాత 'ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించింది. అలాగే, 'బార్ బార్ దేఖో', 'కహానీ 2', 'దబాంగ్ 3' సినిమాల్లోనూ నటించింది.









Tags:    

Similar News