బొల్లారం స్టీల్ పరిశ్రమలో పేలుడు, ఒకరు మృతి

తర రాష్ట్రాల నుంచి ప‌రిశ్ర‌మ యాజామాన్యాలు కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరి చేస్తున్నాయ‌ని కార్మికులు అంటున్నారు. ఎలాంటి

Update: 2022-05-04 06:15 GMT
  • మీనాక్షి స్టీల్ పరిశ్రమలో ఘటన
  • ఒక‌రు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
  • మీనాక్షి స్టీల్ కంపెనీ పై కేసు నమోదు
బొల్లారం సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో మీనాక్షి రాడ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభ‌వించింది. ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే హేమంత్ అనే వ్యక్తి మంట‌ల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు.. ఈ ఘ‌ట‌న‌లో మరో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని, క్ష‌త‌గాత్రుల‌ను ఆసుపత్రికి తరలించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు ప‌రిశ్ర‌మ‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న బొల్లారం పోలీసులు తెలిపారు.
అయితే ఇతర రాష్ట్రాల నుంచి ప‌రిశ్ర‌మ యాజామాన్యాలు కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరి చేస్తున్నాయ‌ని కార్మికులు అంటున్నారు. ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇష్టారాజ్యంగా హార్డ్ వర్క్ చేయించుకుంటున్నార‌ని.. పరిశ్రమలో భగభగమండే రాడ్స్ యంత్రాల ద్వారా బయటకు వస్తుంటే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా, ఎలాంటి సేఫ్టీ లేకుండా పరిశ్రమలు న‌డిపిస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు త‌ప్ప చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. మీనాక్షి పరిశ్రమలో బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నామ‌ని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.


Tags:    

Similar News