ఇంట్లో కోటి 64 లక్షల నగదు
కోటి రూపాయల నగదు బయట పడింది. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం ఈ డబ్బును బయట పెట్టింది
ఒక ఇంట్లో కోటి రూపాయల నగదు బయట పడింది. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం ఈ డబ్బును బయట పెట్టింది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఇంట్లో కోటి అరవై నాలుగు లక్షల రూపాయల కరెన్సీ కట్టలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఫైర్ యాక్సిడెంట్‌తో...
ఈ ఇంటి యజమాని శ్రీనివాస్ ఒక ప్రముఖ కంపెనీలో డిజీఎం స్థాయి అధికారిగా పనిచేస్తున్నారు. హవాలా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బెడ్ రూమ్ లో ఈ నగదును ఉంచడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారి ఆందోళనను అనుమానించిన అగ్నిమాపక సిబ్బంది పెద్దమొత్తంలో డబ్బు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ నగదును సీజ్ చేసినట్లు తెలిసింది. నగదుతో పాటు బంగారం, వెండి కూడా పెద్దయెత్తున లభ్యమయినట్లు తెలిసింది.