200 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

పాకిస్థాన్ నుంచి భారత్ కు తీసుకొస్తున్న 200 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు

Update: 2022-09-14 07:02 GMT

పాకిస్థాన్ నుంచి భారత్ కు తీసుకు వస్తున్న రెండు వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను గుజరాత్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి బోటు ద్వారా నలభై కిలోల హెరాయిన్ ను గుజరాత్ కు తరలిస్తున్నారు. తనిఖీలు చేస్తున్న కోస్గ్ గార్డ్ సిబ్బంది, యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఈ డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్ కు తరలించేందుకు...
ఈ సందర్భంగా ఆరుగురు పాకిస్థాన్ దేశానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు. బోటును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను గుజరాత్ లోని కచ్ జిల్లా జకావ్ ఓడరేవుకు తరలించి అక్కడి నుంచి పంజాబ్ కు తరలించాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. గుజరాత్ నుంచి పంజాబ్ కు రోడ్డు మార్గం ద్వారా తరలించాలని భావించారు. అందుకు చేపలు పట్టే పడవను వినియోగించారు. తీరంలో జరుపుతున్న దాడుల్లో ఈ డ్రగ్స్ బయటపడ్డాయి.


Tags:    

Similar News