స్టార్ హోటల్ కు వెళ్లి కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని తాగిన కుటుంబం
సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోటల్‌లో ఒక కుటుంబం
సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోటల్‌లో ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించింది. వీరిని శంషాబాద్‌లోని మధుర నగర్‌లో నివాసం ఉంటున్న తోట బావన్న, అతని భార్య పద్మావతి, వారి కుమారుడు సుజన్ గా పోలీసులు గుర్తించారు.ఈ ముగ్గురు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరుకున్నారని హోటల్ సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వారు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మహంకాళి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇంకా తెలియలేదు. క్లూస్ టీమ్ హోటల్ గది నుండి ఆధారాలను సేకరించింది. కూల్ డ్రింక్ లో విషం కలిపి వారు తాగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఎవరైనా మానసిక ఆరోగ్య సవాళ్లతో ఉన్నారని లేదా కలత చెందుతున్నారని మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. ఆత్మహత్య నిరోధక సంస్థల నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆత్మహత్యల నివారణ (టోల్‌ఫ్రీ): 104
రోష్ని: 040 66202000, 6620200
సేవా: 09441778290, 040 27504682 (ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య)