ధర్మారంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.40 కోట్ల ఆస్తి నష్టం

గోదాం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో గోదాం గోడలు కూలిపోయాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం..

Update: 2022-04-12 05:42 GMT

ధర్మారం : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. టెస్కోకు సంబంధించిన దుస్తులను ఈ గోదాంలో నిల్వ ఉంచుతారు. ప్రమాద సమయంలో గోదాంలో 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే దుస్తులు ఉన్నట్లు టెస్కో అధికారులు వెల్లడించారు.

గోదాం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో గోదాం గోడలు కూలిపోయాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన చేనేత దుస్తులను నిల్వ ఉంచారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రత కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో నిల్వలు గోదాంలోనే పేరుకుపోయాయి. కాగా.. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గోదాంకు నిప్పంటించారా ? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News