Breaking : సంచలన తీర్పు .. పదిహేను మందికి ఉరిశిక్ష

కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బీజేపీ నేత హత్య కేసులో పదిహేను మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది

Update: 2024-01-30 06:59 GMT

కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భారతీయ జనతా పార్టీ నేత హత్య కేసులో పదిహేను మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకర్తలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నిందితులంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. 2021 డిసెంబరు 19న అలప్పుళలో బీజేపీ ఓబీసా మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగింది.

మూడేళ్ల క్రితం...
ఈ హత్య కేసులో పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా ఆయన ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై విచారించిన కేరళ సెషన్స్ కోర్టు పదిహేను మందిని దోషులుగా గుర్తించి వారికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.


Tags:    

Similar News